పవన్ పై బహుభార్యాత్వం కేసు: విచారణ వాయిదా
విశాఖపట్నం: సినీ నటుడు పవన్ కళ్యాణ్ బహు భార్యాత్వం కేసు వచ్చే నెల రెండో తేదీకి వాయిదా పడింది. తుది నివేదిక సమర్పించడానికి పోలీసులు మరింత గడువు కోరడంతో కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. పోలీసులు సోమవారంనాడు తుది నివేదిక సమర్పించాల్సింది. కానీ పాసుపోర్టు కార్యాలయం వంటి వాటి నుంచి తమకు అధికారిక పత్రాలు అందాల్సి ఉందని, అవి అందితే గాని తుది నివేదిక సమర్పించలేమని పోలీసులు చెప్పారు.
పవన్ కళ్యాణ్ బహు భార్యాత్వం కేసులో దర్యాప్తు పూర్తయిందని, అందర్నీ విచారించామని, అధికారికమైన సాక్ష్యాధారాల కోసం కొన్ని కార్యాలయాలకు రాశామని, అవి తమకు అందాల్సి ఉందని, అందుకే నివేదిక సమర్పణకు గడువు కోరామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications
