చిరు కుటుంబానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: శ్రీజ దంపతులకు హాని కలిగించబోమని హామీ పత్రం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఆదేశించింది. పిటిషనర్స్ తరఫు న్యాయవాది వాదనను విన్న హైకోర్టు శ్రీజ దంపతులకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఢిల్లీలో స్థానిక చిరునామా పోలీసులకు తెలియజేయాలని హైకోర్టు శ్రీజ దంపతులను ఆదేశించింది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అంతకుముందు శ్రీజ దంపతులు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రియించిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న పలుకుబడి వల్ల పిటిషనర్స్ కు ఆంధ్రప్రదేశ్ లో న్యాయం జరగదని శ్రీజ, శిరీష్ భరద్వాజ్ దంపతుల తరఫు న్యాయవాది పింకీ ఆనంద్ ఢిల్లీ హైకోర్టులో అంతకు ముందు వాదించారు. వారికి పోలీసు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. శిరీష్ భరద్వాజ్ దంపతులపై ఆంధ్రప్రదేశ్ లో తప్పుడు కేసులు బనాయించే అవకాశం కూడా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీజ దంపతులను కిడ్నాప్ చేసి హతమార్చే అవకాశం కూడా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వారు ఢిల్లీలో అజ్ఞాతంలో ఉంటున్నారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications
