పవన్ కళ్యాణ్ కారణం చెప్పలేదు: డిసిపి
హైదరాబాద్: సినీ నటుడు పవన్ కళ్యాణ్ రివాల్వర్ స్వాధీనం చేయడానికి గల కారణాన్ని తెలియజేయలేదని హైదరాబాదులోని జూబిలీహిల్స్ డిసిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం పదిన్నర గంటలకు జూబిలీ హిల్స్ పోలీసులకు రివాల్వర్ అప్పగించారు. పవన్ కళ్యాణ్ రివాల్వర్ లైసెన్సును తమ వద్ద డిపాజిట్ చేయలేదని, రివాల్వరును మాత్రమే డిపాజిట్ చేశారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్ 0.2 పాయింటు రివాల్వరును స్వాధీనం చేశారని ఆయన చెప్పారు.
ఎవరైనా పోలీసుల వద్ద లైసెన్స్డు రివాల్వరును స్వాధీనం చేయవచ్చునని ఆయన చెప్పారు. వాటిని వారు ఎప్పుడైనా తీసుకోవచ్చునని ఆయన అన్నారు. తనకు రైఫిల్ షూటింగ్ అంటే ఇష్టమని, తాను మద్రాస్ రైఫిల్ క్లబ్ సభ్యుడినని ఆయన అంతకు ముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తనకు రివాల్వరును తన అన్న చిరంజీవి కొనిచ్చాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
