ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన శ్రీజ దంపతులు
న్యూఢిల్లీ: తమకు పోలీసు రక్షణ కావాలని కోరుతూ శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు విచారణకు రానున్నది. శ్రీజ దంపతులు పింకీ ఆనంద్ అనే మహిళను న్యాయవాదిగా నియమించుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని శ్రీజ దంపతులు భయపడుతున్నారని పింకీ ఆనంద్ అంటున్నారు.
శ్రీజ దంపతులు హైకోర్టుకు ఆశ్రయించడం అనూహ్య మలుపుగానే భావించవచ్చు. దీని వెనక ఎవరో పెద్దవాళ్లు ఉండి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కారణాలపై కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.












Click it and Unblock the Notifications
