తెలుగు హాస్యనటి మమత కన్నుమూత
చెన్నై: ప్రముఖ హాస్యనటి మమత చెన్నైలో కన్నుమూశారు. ఆమె వయస్సు 55 ఏళ్లు. గత రాత్రి ఊపిరి తీసుకోవడం కష్టం కాకపోవడంతో ఆమెను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలోనే ఆమె తుది శ్వాస విడిచారు. భూమి కోసం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన మమత 250కి పైగా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ చిత్రాల్లో హాస్యనటిగా నటించారు. కారు దిద్దిన కాపురం ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు మారిన తర్వాత కూడా ఆమె చెన్నైలోనే ఉంటూ సినిమాలకు, సీరియళ్లకు డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. ఆమె గజదొంగ, చుట్టాలున్నారు జాగ్రత్త వంటి తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె మృతికి చెన్నైలోని డబ్బింగ్ కళాకారులు సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications