వరికి మద్దతు ధర కోసం ఢిల్లీలో చంద్రబాబు
న్యూఢిల్లీ: వరికి మద్దతు ధర ప్రకటించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు మంగళవారంనాడు ప్రధాని అప్పాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం. ప్రధానిని ఆయన బుధవారంనాడు కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను చంద్రబాబు కలిసి వరికి మద్దతు ధర కల్పించాలని కోరనున్నారు. ఆయన మంగళవారంనాడు కొంతమంది వామపక్షాల నాయకులతో సమావేశమయ్యారు. మంగళవారం రాత్రి ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాలాతో సమావేశమై మూడో ప్రత్యామ్నాయంపై చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications