చర్లపల్లి జైలులో ఖైదీల ఘర్షణ: ఒకరి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఖైదీ మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఆరుగురు ఖైదీలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణల్లో లక్ష్మయ్య అనే ఖైదీ మృతి చెందాడు. మిగతావారు సికింద్రాబాదులోని గాంధీ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే జైలులో ఘర్షణ జరిగిందనే వార్తలను జైలు సూపరింటిండెంట్ ఖండిస్తున్నారు. అటువంటి ఘర్షణేదీ జరగలేదని ఆయన చెప్పారు. ఆగస్టు 2 నుంచి శిక్ష అనుభవిస్తున్న లక్ష్మయ్య అనే ఖైదీ గుండెనొప్పితో బాధపడుతుంటే జైలులోనే వైద్యం అందిస్తున్నామని, పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా లక్ష్మయ్య మరణించాడని ఆయన వివరిస్తున్నారు. చర్లపల్లి జైలులో గతంలో కూడా ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది












Click it and Unblock the Notifications