ఏనుగుల బెడదపై ఆపరేషన్ గజ షురూ
శ్రీకాకుళం: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ఆపరేషన్ గజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక వైపు ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే ఏనుగులు మరో వ్యక్తిని చంపేశాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సరిహద్దులోని గడ్డ తిరువాడలో ఏనుగులు ఒక వ్యక్తిని తొక్కి చంపేశాయి. ఆపరేషన్ గజ కార్యక్రమం కోసం శిక్షణ పొందిన ఏనుగులను రప్పిస్తున్నారు. ఒక ఏనుగు చిత్తూరు నుంచి, రెండు ఏనుగులు కర్ణాటక నుంచి వస్తున్నాయి.
దాదాపు 30 మంది నిపుణులు ఆపరేషన్ గజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే 20 మంది నిపుణులు పని చేస్తున్నారు. అస్సాం నుంచి భుజానంద చౌదరి నుంచి రప్పిస్తున్నారు. వారం రోజుల్లో ఏనుగుల సమస్యను తీర్చగలమని నిపుణులు అంటున్నారు. ఏనుగులకు మత్తు మందు ఇచ్చే పట్టేసే దిశలో కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఏ మోతాదులో మత్తు మందు ఇవ్వాలనేది తేల్చడానికి హైదరాబాద్ నుంచి నవీన్ అనే వైద్యుడు వచ్చారు.












Click it and Unblock the Notifications