నిజాముద్దీన్ ఎక్సుప్రెస్సులో సంచి కలకలం
మహబూబ్ నగర్: ఢిల్లీ నుంచి కర్ణాటకలోని యశ్వంత్ పూర్ కు బయలుదేరిన నిజాముద్దీన్ ఎక్సుప్రెస్ రైళ్లో ఒక బ్యాగ్ కలకలం సృష్టించింది. సికింద్రాబాదు నుంచి బయలుదేరిన ఈ రైళ్లోని ఎస్ 1 బోగీలో కదిలించకుండా ఉన్న బ్యాగును చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైలును మహబూబ్ నగరులో ఆపేసి బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.
బ్యాగులో ఒక ఖాళీ టిన్ను, కొన్ని వస్తువులు కనిపించాయి. బ్యాగు నుంచి కిరోసిన్ వాసన వస్తోంది. బ్యాగులోని వస్తువులు ప్రమాదకరమైనవి కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు గాలి పీల్చుకున్నారు. రైలు తనిఖీల కోసం మహబూబ్ నగరులో గంట సేపు ఆగింది.












Click it and Unblock the Notifications