రిసెప్షన్ ఏర్పాటు చేస్తే వస్తాం: శ్రీజ
న్యూఢిల్లీ: తమ రెండు కుటుంబాలు కలిసి రిసెప్షన్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ వస్తామని శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ చెప్పింది. తమ కుటుంబంతో పాటు తన భర్త కుటుంబం కలిసి మాట్లాడుకుని రిసెప్షన్ ఏర్పాటు చేస్తే తాము హైదరాబాద్ వస్తామని చెప్పింది. తాను నాన్న చిరంజీవి బాధ పడేంత తప్పు ఏమీ చేయలేదని ఆమె అన్నది. తాము ఏమైనా తప్పు చేశామని భావిస్తే క్షమించాలని ఆమె తన కుటుంబ సభ్యులను కోరింది.
పెళ్లి చేసుకున్నప్పుడు తాము ఢిల్లీకి రావాలని అనుకోలేదని, తమకు అక్కడ పోలీసుల నుంచి రక్షణ లభించకపోవడం వల్లనే ఢిల్లీకి వచ్చామని ఆమె స్పష్టం చేసింది. తమ వెనక ఎవరి హస్తమూ లేదని ఆమె చెప్పింది. ఇంతటితో ఈ విషయానికి స్వస్తి చెప్పాలని చిరంజీవి బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శ్రీజ దంపతులకు సూచించారు. రెండు కుటుంబాలవారిని కూర్చుండబెట్టి తాను మాట్లాడుతానని ఆయన ఒక జాతీయ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.












Click it and Unblock the Notifications