తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే పరిష్కారం: ఉప్పునూతల
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరోటి తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచలేదని తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి అన్నారు. ఈ విషయంపై త్వరలో తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని కలుస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణకు ప్రత్యేక పిసిసిని ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.2004 ఎన్నికలకు ముందు ప్రత్యేక పిసిసిని, ఎన్నికల కమీషనును ఇస్తామని పార్టీ నాయకత్వం అంటే కొంత మంది వద్దన్నారని, వారెవరో అందరికీ తెలుసునని, ఇప్పుడు వారే బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications