శరద్ పవార్ తో చంద్రబాబు భేటీ
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను బుధవారంనాడు కలుసుకున్నారు. వరికి వేయి రూపాయల మద్దతు ధర ప్రకటించాలని చంద్రబాబు శరద్ పవార్ ను కోరారు. వరి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన శరద్ పవార్ తో చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనకార్యక్రమాల గురించి కూడా ఆయన శరద్ పవార్ కు వివరించారు.
అంతకు ముందు ఆయన సిపిఐ ప్రధాన కార్యదర్శి బర్దన్ ను కలుసుకున్నారు. ఆయన ప్రధాన ఎన్నికల కమీషనరును కూడా కలుసుకున్నారు. ఓటర్ల జాబితాల రూపకల్పనలో అవకతవకలు జరగకుండా చూసేందుకు రాష్ట్రానికి పరిశీలకులను పంపాలని ఆయన ప్రధాన ఎన్నికల కమీషనరుకు విజ్ఞప్తి చేశారు












Click it and Unblock the Notifications
