వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలుళ్ల కేసులో బాషా, అన్సారీలకు జీవిత ఖైదు

By Staff
|
Google Oneindia TeluguNews


కోయంబత్తూర్: కోయంబత్తూరులో 1998లో సంభవించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులు ఆల్-ఉమ్మా అధ్యక్షుడు ఎస్ఏ బాషా, కార్యదర్శి మహ్మద్ అన్సారీలకు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారులుగా వారిపై అభియోగాలు రుజువు కావడంతో ఈ శిక్ష విధించింది. దీంతో పాటు వారిపై నమోదైన మరో 12 అభియోగాల్లో మూడు నుంచి 9 ఏళ్ల పాటు జైలుశిక్ష విధిస్తున్నామని తెలిపింది. ఏకకాలంలోనే ఈ రెండు శిక్షలను అమలు చేయాలని ఆదేశించింది.

బాషా, అన్సారీలు చట్టవ్యతిరేకంగా రహస్య కార్యకలాపాలను సాగించారని, 1998 బాంబు పేలుళ్లలో వీరు ప్రధాన నిందితులని రుజువుకావటంతో జడ్జి ఈ మేరకు తీర్పు చెప్పారు. వీరు గత 9 ఏళ్లుగా పోలీసు కస్టడీలో ఉన్నారు కనుక జీవిత ఖైదు శిక్ష కాలాన్ని తగ్గించామని తెలిపారు.కోయంబత్తూరులో 1998 ఫిబ్రవరి 14న జరిగన ఈ వరుస బాంబు పేలుళ్ల సంఘటనలో 58 మంది దుర్మరణం చెందగా, దాదాపు 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే కోట్లాది రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X