కాంగ్రెసుకు సింగిల్ డిజిట్ దక్కదు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణపై రెండో ఎస్సార్సీ అంటే కాంగ్రెసుకు ప్రజలే గుణపాఠం చెప్తారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెసు సీట్లు సింగిల్ డిజిట్ దాటవని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణపై కాంగ్రెసుకు స్పష్టత లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటనకు, వీరప్ప మొయిలీ ప్రకటనకు మధ్య పొంతన లేదని ఆయన అన్నారు.
తెలంగాణ విషయంలో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక (సియంపి)కు కట్టుబడి ఉన్నామని ప్రధాని చెప్పినట్లు ఆయన తెలిపారు. వీరప్ప మొయిలీ అరిగిపోయిన రికార్డును మళ్లీ వినిపించిన కొత్త ఇన్ చార్జీ అని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసులోనే ఏకాభిప్రాయం లేదని ఆయన విమర్శించారు. అయోమయంతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు దూరమవుతుందని, కాంగ్రెసును చూస్తుంటే జాలి వేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
