మధుమిత హత్యకేసు: అమర్ మణికి జీవిత ఖైదు
డెహ్రాడూన్: రచయిత్రి మధుమిత శుక్లా హత్యకేసులో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అమర్ మణి త్రిపాఠీకి డెహ్రాడూన్ జిల్లా, సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. త్రిపాఠీ భార్య మధుమణితో పాటు మరో ఇద్దరికి కూడా జీవిత ఖైదు విధిస్తూ కోర్టు బుధవారంనాడు తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు పడిన ఆ ఇద్దరు నిందితులు రోహిత్ చతుర్వేది, సంతోష్ రాయ్.
ఈ కేసులో మరో నిందితుడు ప్రకాష్ పాండేను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ నలుగురికి కోర్టు 50 వేల రూపాయలేసి జరిమానా కూడా విధించింది. రచయిత్రి మధుమిత శుక్లా 2003 మే 9వ తేదీన హత్యకు గురైంది.












Click it and Unblock the Notifications
