వైయస్ ను వ్యతిరేకించిన నేదురుమల్లి
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు చేయాలనే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆలోచనను మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వ్యతిరేకించారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వీరప్పమొయిలీ సమక్షంలో బుధవారం జరిగిన పిసిసి సమావేశంలో జనార్దన్ రెడ్డి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు కష్టసాధ్యమని, ఇప్పుడు దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన అన్నారు. ఈ పథకం అమలుకు నిధుల సమీకరణ కష్టమవుతుందని ఆయన అన్నారు. తాత్కాలిక పిసిసి అధ్యక్షుడిగా సి.వి. శేషారెడ్డిని కాకుండా జి.ఏస్. రావును నియమించడాన్ని ఆయన వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications
