కాంగ్రెస్ నాయకత్వంపై సర్వే నిరసన గళం
హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ పార్టీ అధిష్ఠానంపై నిరసన గళం విప్పారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తే పార్టీ దెబ్బ తింటుందని, రెండో ఎస్సార్సీ వేసే బదులు తెలంగాణ రాష్ట్ర ఇవ్వడం ఇష్టం లేదని చెప్పాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు ప్రత్యేక పిసిసి అడిగే హక్కు తెలంగాణవారికి ఉందని మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. ప్రత్యేక పిసిసి ఇస్తే తెలంగాణ నుంచి పిసిసి అధ్యక్షుడిని వేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
ప్రత్యేక పిసిసి కన్నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని పార్లమెంటు సభ్యుడు మధయాష్కీ అన్నారు. రెండో ఎస్సార్సీ వేసినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఇవ్వరనే అభిప్రాయానికి రావాల్సిన అవసరం లేదని ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీతో మాట్లాడిన తర్వాత తెలంగాణపై తాను మాట్లాడుతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
