జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు: అరెస్టులు
హైదరాబాద్: వామపక్షాలు తమ భూపోరాటాన్ని ఉధృతం చేశాయి. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు, గ్రామీణ పేదలకు సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపియం, సిపిఐ కార్యకర్తలు గురువారంనాడు రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలకు దిగారు. పలు చోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిపిఐ కార్యదర్శి కె. నారాయణ, సిపియం కార్యదర్శి బి.వి. రాఘవులు కలిసి హైదరాబాదులో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాటే మరిచిందని వారు విమర్శించారు. హైదరాబాదులో ప్రభుత్వం సర్వే నాటకం ఆడుతోందని బి.వి. రాఘవులు విమర్సించారు. నవంబర్ 1వ తేదీనుంచి భూములను పంచుతామని చెప్పి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసిందని ఆయన విమర్శించారు. భూపంపకంపై ప్రభుత్వం నాటకం ఆడుతోందని ఆయన అన్నారు. ఒక వైపు భూకామందులు కబ్జాలకు పాల్పడుతుంటే మరో వైపు ప్రభుత్వం ఉన్న భూములను అమ్ముతోందని, ఈ స్థితిలో పేదలకు భూములు మిగిలే పరిస్థితి కూడా లేదని కె. నారాయణ విమర్శించారు












Click it and Unblock the Notifications