పరిటాల కేసు విచారణ బదిలీకి పిటిషన్
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసు విచారణను హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ నిందితులు కొందరు గురువారంనాడు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శీను, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఈ పిటిషనును దాఖలు చేశారు. ఈ పిటిషనుపై విచారణను కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.
పరిటాల రవి హత్య కేసు విచారణ అనంతపురం కోర్టులో జరుగుతోంది. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన సూత్రధారి మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరికి, మిగతా నిందితులకు మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయనే మాట వినిపిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications