తెలంగాణపై సోనియాదే తుది నిర్ణయం: మొయిలీ
హైదరాబాద్: తెలంగాణపై తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీదే తుది నిర్ణయమని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలనేది పార్టీ నిర్ణయమని, అయితే సోనియాదే తుది నిర్ణయమని ఆయన అన్నారు.
తమ పార్టీ ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉందని, తెలంగాణ అంశాన్ని తొందరగా తేల్చాలని ఈ ప్రాంత నాయకులు సోనియాను కోరుతున్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్ బ్రదర్స్ కు జారీ చేసిన షోకాజ్ నోటీసుల గురించి తనకు తెలియదని ఆయన చెప్పారు. దిగ్విజయ్ సింగ్ హయాంలో వారికి పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications