కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు రాజీనామా
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి సవాలును స్వీకరిస్తూ కాంగ్రెస్ అనుబంధ శాసనసభ్యుడు జూపల్లి కృష్ణారావు రాజీనామా చేశారు. తనపై జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని ఆయన జనార్దన్ రెడ్డికి సవాల్ వేస్తూ రాజీనామా చేశారు. జనార్దన్ రెడ్డి అందుకు అంగీకరిస్తే తన రాజీనామాను ఆమోదించాలని జూపల్లి కృష్ణారావు స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డికి సమర్పించిన రాజీనామా లేఖలో కోరారు. జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వనపర్తి శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి తనపై పోటీకి సిద్ధపడాలని గతంలో నాగం జనార్దన్ రెడ్డి రాష్ట్ర మంత్రి చిన్నారెడ్డిని సవాల్ చేశారు. అయితే తనది జనార్దన్ రెడ్డి స్థాయి కాదని, కావాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ దామోదర్ రెడ్డి రాజీనామా చేసి నాగం జనార్దన్ రెడ్డిపై పోటీ చేస్తారని చిన్నారెడ్డి బదులిచ్చారు. అయితే అందుకు జనార్దన్ రెడ్డి నిరాకరించారు. దీంతో తాజాగా జూపల్లి కృష్ణారావు చేత రాజీనామా చేయించి జనార్దన్ రెడ్డికి సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications
