భూమి కోసం నారాయణ నిరవధిక దీక్ష
హైదరాబాద్: హైదరాబాదులోని హఫీజ్ పేటలో గల భూమిని పేదలకు పంచాలని డిమాండు చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ శుక్రవారంనాడు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. పార్టీ పార్లమెంటు సభ్యుడు సువరం సుధాకర్ రెడ్డి నారాయణ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ భూములను పేదలకు పంచకపోతే తమ భూపోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. నారాయణ దీక్షకు భారీగా పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు.
హఫీజ్ పేట భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచకపోతే తామే జెండాలు పాతి పంచుతామని నారాయణ అన్నారు. ప్రభుత్వం కామందుల కొమ్ము కాస్తోందని ఆయన విమర్శించారు. గత కొంత కాలంగా నారాయణ నేతృత్వంలో సిపిఐ కార్యకర్తలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటూ జెండాలు పాతుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
