వీరప్పమొయిలీపై జయశంకర్ మండిపాటు
వరంగల్: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) కనీస ఉమ్మడి ప్రణాళికను (సియంపి)ని చదివే తెలంగాణపై మాట్లాడారా అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీని ప్రశ్నించారు. సియంపిలో రెండో ఎస్సార్సియే ఉందని వీరప్ప మొయిలీ చెప్పడం పచ్చి అబద్ధమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వీరప్పమొయిలీ ప్రకటనపై ఆయన మండిపడ్డారు.
విస్తృత ఏకాభిప్రాయ సాధనతో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని సియంపిలో ఉందని ఆయన స్పష్టం చేశారు. కోస్తాంధ్ర నాయకుల ప్రభావానికి గురై వీరప్పమొయిలీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. వీరప్ప మొయిలీ అవగాహనా రాహిత్యంతో, బాధ్యతారాహిత్యంతో తెలంగాణపై మాట్లాడారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
