క్షమించాలని కోరుతున్నాం: చిరు అల్లుడు శిరీష్
న్యూఢిల్లీ: తాము ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని తమ రెండు కుటుంబాలను కోరుతున్నామని మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజను ప్రేమపెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్ అన్నాడు. శ్రీజ తమ ఇంట్లోనే కాపురం పెట్టాల్సి ఉందని, అందువల్ల వారంలోగా తాము హైదరాబాదు వెళ్లి తమ ఇంట్లో కాపురం పెడ్తామని అతను అన్నాడు. శ్రీజతో కలిసి అతను ఢిల్లీలోని ఎపి భవన్ కు వచ్చాడు. ఆమెతో కలిసి అతను మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు.
తమ కుటుంబ సభ్యులతో రెండు రోజుల క్రితం శ్రీజ మాట్లాడిందని, తమ కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించారని అతను అన్నాడు. జరిగిందేదో జరిగింది, ప్రెస్సుకు వెళ్లడం వంటి పనులు మానుకుని ఇంటికి రమ్మన్నారని అతను చెప్పాడు. రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిరితే మంచిదని అతను అన్నాడు. తమను క్షమించాలని తాము ఇది వరకే కోరామని, ఇప్పుడు కూడా కోరుతున్నామని అతను అన్నాడు. భద్రత కారణాల రీత్యా తమ కారు నెంబరు కవర్ చేసినట్లు అతను తెలిపాడు.












Click it and Unblock the Notifications
