చిన్నారెడ్డికే నా సవాల్ వర్తిస్తుంది: నాగం
హైదరాబాద్: ఎవరు పడితే వారు సవాల్ విసిరితే తాను స్పందించాల్సిన అవసరం లేదని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ శాసనసభ్యుడు జూపల్లి కృష్ణారావు రాజీనామా ఓ నాటకమని ఆయన జూపల్లి కృష్ణారావు విసిరిన సవాలుపై శుక్రవారంనాడు మీడియాతో అన్నారు. తన సవాల్ మంత్రి చిన్నారెడ్డికే వర్తిస్తుందని ఆయన చెప్పారు. చిన్నారెడ్డి రాజీనామా చేసి తనపై పోటీకి సిద్ధపడితే తాను సిద్ధపడ్తానని, తాను చిన్నారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు.
తాను చిన్నారెడ్డికి సవాల్ విసిరితే జిల్లా పరిషత్ చైర్మన్ దామోదర్ రెడ్డిపై పోటీకి సిద్ధపడాలని అన్నారని, తాను ఇప్పటికే దామోదర్ రెడ్డిపై రెండు సార్లు గెలిచానని ఆయన చెప్పారు. ఇప్పుడు కొత్తగా జూపల్లి కృష్ణారావు రాజీనామా నాటకం ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. తాను వారి అవినీతి గురించి మాట్లాడుతున్న ప్రతిసారీ వారు ఈ నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. దమ్ముంటే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభను రద్దు చేసి ఎన్నికలను సిద్ధపడాలని ఆయన సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications
