గుజరాత్ ఊచకోత: 8 మందికి జీవిత ఖైదు
అహ్మదాబాద్: గోద్రా అల్లర్ల అనంతరం జరిగిన ఎరాల్ ఊచకోత కేసులో గోద్రా కోర్టు 11 మందిని దోషులుగా నిర్ధారించింది. వీరిలో ఎనిమిది మందికి జీవిత ఖైదు, మరో ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మరో 29 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2002లో జరిగిన ఎరాల్ ఊచకోతలో ఏడుగురు మరణించారు.
జీవితఖైదు పడిన ఎనిమిది మందిలో ముగ్గురిని ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిపినందుకు కూడా అడిషనల్ సెషన్స్ జడ్జి హెచ్.ఎం. ధోలాక్యా దోషులగు నిర్ధారించారు. ఈ ఊచకోత 2002 మార్చి 3వ తేదీన జరిగింది.












Click it and Unblock the Notifications