అభివృద్దికి జిల్లాల్లో ప్రత్యేక జాయింట్ కలెక్టర్లు
హైదరాబాద్: అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టరును నియమించాలని జిల్లా కలెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో తీసుకున్ననిర్ణయాలను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియా ప్రతినిధులకు వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీనుంచి మూడో విడత ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇందిరమ్మ పథకం కోసం పట్టణ ప్రాంతాల్లో భూసేకరణకు రెట్టింపు నష్టపరిహారం చెల్లించాలనే జీవోను రేపు సాయంత్రంలోగా జారీ చేస్తామని ఆయన చెప్పారు. మిగిలిపోయిన అర్హులందరికీ డిసెంబరులోగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications