ఎస్ కెయులో తోపులాట: లాఠీచార్జీ
అనంతపురం: అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఓపెన్ ఫోరం సదస్సు ఉద్రిక్తతకు దారి తీసింది. విశ్వవిద్యాలయంలోని సమస్యలను చర్చించి పరిష్కరించుకోవడానికి ఆడిటోరియంలో ఓపెన్ ఫోరం సదస్సు నిర్వహించారు. హాజరీతో సంబంధం లేకుండా పరీక్షలకు అనుమతించాలని విద్యార్థులు కోరారు. కొంతమంది అధ్యాపకులు కూడా రావడం లేదంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు.
ఆ సమయంలో వైస్ చాన్సలర్, ప్రిన్సిపాల్ సదస్సు నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులకు, సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. పోలీసుల లాఠీచార్జీని నిరసిస్తూ విద్యార్థులు విసి బంగ్లాను ముట్టడించారు.












Click it and Unblock the Notifications