బ్రీచ్ కాండిలో వీణ, వాణిలకు శస్త్రచికిత్స
హైదరాబాద్: తలలు పెనవేసుకుపోయి పుట్టిన వీణ, వాణి అనే కవల పిల్లలకు శస్త్ర చికిత్స చేయడానికి ముంబయిలోని బ్రీచ్ కాండీ అస్పత్రి ముందుకు వచ్చింది. శస్త్ర చికిత్స చేసి వారిద్దరిని వేరు చేయాల్సి ఉంటుంది. వారికి శస్త్ర చికిత్స చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్రీచ్ కాండి ఆస్పత్రికి చెందిన ఆశీష్ మెహతా తమకు లేఖ రాశారని, ఇ- మెయిల్ మెసేజ్ కూడా ఇచ్చారని నీలోఫర్ అస్పత్రి వర్గాలు చెప్పాయి.
శస్త్ర చికిత్సకు దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఒక అంచనా. అంతేకాకుండా నిపుణులైన వైద్యులు అవసరం. తాము వీణ, వాణిలకు శస్త్రచికిత్స చేయలేమని నీలోఫర్ చేతులెత్తేసింది. అయినా వారిని తీసికెళ్లడానికి తల్లిదండ్రులు నిరాకరించారు. చాలా కాలంగా వీణ, వాణిలు నీలోఫర్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు.












Click it and Unblock the Notifications