అణు ఒప్పందంపైనే బాబుతో చర్చలు: కారత్
చెన్నై: అమెరికాతో అణు ఒప్పందంపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధనకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, యుఎన్ పిఎ కన్వీనర్ నారా చంద్రబాబు నాయుడితో చర్చలు జరిపినట్లు సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు.అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉండాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు. ఈ దిశగానే వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఇటీవల యూఎన్‌పీఏ నేతలతోనూ మంతనాలు సాగించామని వెల్లడించారు.
మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ఇది తగిన సమయం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో త్వరలోనే లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో మూడో ఫ్రంట్ ఏర్పడనుందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధితో సోమవారం చెన్నైలోని ఆయన నివాసంలో సమావేశమైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రానికి తమ వల్ల ముప్పు ఏర్పడవచ్చన్న వార్తలను కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications