డిగ్రీ విద్యార్థినిపై లెక్చరర్ యాసిడ్ దాడి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో కల్పన అనే విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పలాస అస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆమెపై దాడి చేసిన దామోదర్ అనే అధ్యాపకుడు పరారీలో ఉన్నాడు. దామోదర్ అనే వ్యక్తి కల్పనపై పథకంపై ప్రకారం యాసిడ్ చల్లి పారిపోయాడు. ఆమె కళ్లపై, వీపుపై యాసిడ్ పడింది.
కల్పన పలాసలోని సాయిశిరీష అనే కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ప్రేమ పేరుతో దామోదర్ పదో తరగతి నుంచి వేధిస్తున్నాడు. విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న దామోదర్ ఇటీవల స్వగ్రామం వచ్చాడు. సమీపంలోని స్వగ్రామం నుంచి కల్పన బస్సులో పలాసలోని కళాశాలకు నిత్యం వస్తుంది. ఎప్పటి లాగే శుక్రవారంనాడు కూడా బస్సులో పలాసకు బయలుదేరి శ్రీనివాస లాడ్జి జంక్షను వద్ద దిగింది. ఆమె వెనకే బస్సు దిగిన దామోదర్ ఆమెపై యాసిడుతో దాడి చేశాడు. స్వగ్రామం వచ్చిన తర్వాత పెళ్లి గురించి మాట్లాడడానికి రావాలని కల్పనను అతను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఈ కారణంగానే అతను ఆమెపై దాడి చేశాడు.












Click it and Unblock the Notifications
