వైయస్ జగన్ కు 40 కోట్లు ఎక్కడివి?: బాబు


కడప: ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి 40 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 9 లక్షల రూపాయల నుంచి జగన్ ఆస్తులు 40 కోట్లకు ఎలా పెరిగాయని ఆయన అడిగారు.

వరద తాకిడికి గురైన కడప జిల్లాలో పర్యటించడానికి వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బినామీ పేర్లతో కోట్లాది రూపాయల భూములను అన్యాక్రాంతం చేశారని ఆయన విమర్శించారు.

పంటలకు గిట్టుబాటు ధరలు లభించకనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని, ఈ దేశవ్యాప్త ఉద్యమానికి ఈ నెల 26వ తేదీన శ్రీకారం చుడుతామని ఆయన చెప్పారు.

కడప జిల్లాను వరదలు తాకినప్పుడు ముఖ్యమంత్రి ఈ జిల్లాలోనే ఉన్నారని, అయినా సహాయచర్యలు అమలు కాలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సేవలో మునిగిపోయిన అధికారులు వరదలకు ప్రజలను వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+