శివాజీ గణేశన్ భార్య కమలా అమ్మాళ్ మృతి
చెన్నై: ప్రముఖ తమిళ సినీనటుడు శివాజీ భార్య కమలా గణేశన్ శుక్రవారంనాడు ఒక ప్రైవేట్ అస్పత్రిలో కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివాజీ గణేషన్ భార్య కమలా గణేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
కమలా గణేశన్ వయస్సు 68 ఏళ్లు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు ప్రభు సినిమా నటుడు ప్రభు కాగా రెండో కుమారుడు నటుడూ నిర్మాత రామకుమార్. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. భర్త శివాజీ గణేషన్ మృతి చెందడంతో తీవ్రంగా కృంగిపోయిన ఆమె గత ఐదేళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఆమె తుది గడియల్లో కుటుంబ సభ్యులందరూ ఆమె పక్కనే ఉన్నారు. ఆమె భౌతిక కాయాన్ని నివాసానికి తీసుకెళ్లి అభిమానుల సందర్శనార్థం ఉంచారు. విషయం తెలిసిన వెంటనే ప్రముఖ నటులు రజనీకాంత్, కమల హాసన్ ఆస్పత్రికి వచ్చారు. ఆమెకు నివాళులు అర్పించడానికి తమిళ సినిమా రంగమంతా తరలివచ్చింది.












Click it and Unblock the Notifications
