వైయస్సే పెద్ద దుష్టశక్తి: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే దుష్టశక్తి అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. నిజామాబాదులో జరిగే సదస్సుకు బయలుదేరే ముందు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
నవంబర్ 1వ తేదీన తెలంగాణ అంతటా విద్రోహ దినం జరుపుకుంటుంటే రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులను చట్టబద్దంగా అడ్డుకుంటామని ఆయన చెప్పారు.
రియలన్స్ ఫ్రెష్ లపై దాడులు చేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు. చిన్న వ్యాపారుల పొట్ట కొట్టే రిలయన్స్ ఫ్రెష్ లోనే కాదు, హెరిటేజ్ ఫ్రెష్ లను కూడా అడ్డుకుంటామని ఆయన చెప్పారు. నవంబర్ 15వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
