పిసిసి అధ్యక్షుడి ఎంపికపై మాట్లాడను: వైయస్


న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడి నియామకంలో తన ప్రమేయం ఏమీ ఉండదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. వరికి మద్దతు ధరపై, ప్రధాని మన్మోహన్ సింగ్ తో రాష్ట్ర రాజకీయాలపై పార్టీ అధిష్ఠానవర్గంతో చర్చించడానికి రెండు రోజులు పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేది పార్టీ అధిష్ఠానవర్గానికి బాగా తెలుసునని ఆయన అన్నారు.

పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందో పార్టీ అధిష్ఠాన వర్గానికి తెలుసునని, రాష్ట్ర రాజకీయాలు అధిష్ఠానవర్గానికి తెలుసునని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడి నియామకంపై తాను మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వరికి మద్దతు ధరపై ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ను, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను, తదితరులను కలుస్తారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీతో కూడా ఆయన సమావేశమవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+