ఫ్లై ఓవరుపై అంబులెన్స్ బీభత్సం: ఒకరి మృతి
హైదరాబాద్: హైదరాబాదులోని మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవరుపై ఒక అంబులెన్స్ సోమవారం మధ్యాహ్నం బీభత్సం సృష్టించింది. ఈ గొడవలో ఒక ఆటో డ్రైవర్ మరణించాడు. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాదాపు 10 వాహనాలు ధ్వంసమయ్యాయి.
లక్డికా పూల్ నుంచి మెహిదీ పట్నం వెళ్తున్న అంబులెన్స్ మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవరుపై అదుపు తప్పింది. దాంతో అది మొదట ఒక ఆటోను ఢీకొట్టింది. ఆ తర్వాత వాహనాలను ఢీకొడుతూ పోయింది. దీంతో ఫ్లై ఓవరుపై బీభత్స వాతావరణం నెలకొంది. అంబులెన్స్ బ్రేకులు ఫెయిలు్ కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
