రోడ్డు ప్రమాదానికి నాలుగేళ్ల బాలిక బలి
హైదరాబాద్: హైదరాబాదులో రోడ్డు ప్రమాదానికి మరో బాలిక బలి అయింది. బోర్ వెల్ లారీ ఢీకొట్టడంతో నాలుగేళ్ల సలోని మృత్యువాత పడింది. నవజ్యోతి పాఠశాలలో ఎల్ కెజి చదువుతున్న ఆ బాలిక స్కూల్ బస్సు కోసం నిరీక్షిస్తోంది. బస్సు రాకపోవడంతో బిస్కట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి రోడ్డు దాటుతోంది. అంతే, బోర్ వెల్ లారీ ఢీకొట్టింది.
బిడ్డ మృతితో మహేంద్ర సింగ్ దంపతులు శోకసముద్రంలో మునిగిపోయారు. డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతన్ని పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications
