పూజిత చిట్ ఫండ్స్ ఎండి ఆత్మహత్యాయత్నం, మృతి
హైదరాబాద్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పూజిత చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) కొడాలి సత్యనారాణరావు సోమవారం మరణించారు. గత నెల 28వ తేదీ రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన ఆయన అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
గత నెల 28వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో హైదరాబాదులోని జూబిలీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. ఆయనను రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అతను కోమాలోనే ఉన్నాడు. పురుగుల మందు ఊపిరితిత్తులలోకి వెళ్లిపోవడంతో అతని పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో ఆయన మృతి చెందారు.
పూజిత చిట్ ఫండ్స్ ప్రధాన కార్యాలయం విజయవాడలోని సూర్యారావుపేటలో ఉంది. అందులో 35 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. అయితే ఖాతాదారులకు ఆయన ఇస్తున్న చెక్కులన్నీ బౌన్స్ అవుతూ వచ్చాయి. దాంతో ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక అతను రేపు చెల్లిస్తానంటూ హైదరాబాద్ వచ్చేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆయన మృతితో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విజయవాడలోని పూజిత కార్యాలయానికి ఖాతాదారులు చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
