కాంగ్రెస్ బరి తెగించింది: చంద్రబాబు
హైదరాబాద్: కాంగ్రెస్ బరి తెగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శాసనసభ సమావేశాల విషయంలో కాంగ్రెస్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. శాసనసభ సమావేశాల నిర్వహణ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ దారుణంగా వ్యవహరిస్తోందని, శాసనసభ చరిత్ర ఇలా ఎన్నడూ జరగలేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ తీరు బాధాకరమని, ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి తీరు పట్ల ఆయన అసహనం ప్రదర్శించారు. రాజకీయ పార్టీల ప్రాధాన్యతలు, స్పీకర్ ప్రాధాన్యతలు వేరు వేరుగా ఉంటాయని, సభా కార్యక్రమాలు సజావుగా సాగనప్పుడు వాయిదా వేసి వివిధ రాజకీయ పక్షాలతో స్పీకర్ చర్చలు జరపాలని, కానీ స్పీకర్ అలా చేయలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
