వైయస్ సిఎంలా వ్యవహరించడం లేదు: దేవేందర్
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిలా వ్యవహరించడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి వ్యవహరిస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజశేఖర రెడ్డి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి తాము శాసనసభకు వస్తున్నామని, నన్ను ప్రశ్నిస్తారా అనే ధోరణితో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీవారు గుడిని, గుడిలోని లింగాన్ని మింగుతున్నారని, దాన్ని ప్రశ్నించకుండా ముఖ్యమంత్రి పొగడ్తలతో ముంచెత్తుతామా అని ఆయన అన్నారు. డప్పులు, డోల్లు వాయించుకుంటూ ముఖ్యమంత్రిని పొగడడానికా తాము శాసనసభకు వచ్చేది అని ఆయన అడిగారు. ఒక ఎత్తుగడగానే సభా కార్యక్రమాలు జరగకుండా కాంగ్రెస్ వారు చూస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
