నాలుగు కాళ్లు, చేతుల లక్ష్మికి ఆపరేషన్
బెంగుళూర్: నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన రెండేళ్ల పాప లక్ష్మికి స్పర్శ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు కాళ్లు, రెండు చేతులు, ఒక వెన్నెముక, ఇతర అదనపు అవయవాలను వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. బీహారులోని పేద తల్లిదండ్రులకు రెండేళ్ల క్రితం దీపావళి రోజు ఆ పాప పుట్టింది. రెండేళ్ల తర్వాత దీపావళి పర్వదినానికి లక్ష్మి పునర్జన్మ ఎత్తింది. నిజానికి ఆపరేషనుకు 40 గంటలు పడుతుందని వైద్యులు భావించారు. అయితే 36 మంది వైద్యులు 27 గంటల్లోనే ఆపరేషను పూర్తి చేయగలిగారు.
మూడు దశల ఈ ఆపరేషనుకు చరణ్ శివరాజ్ నేతృత్వం వహించారు. లక్ష్మిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఉంచారు. పరీక్షల నిమిత్తం ఆమెను మూడు రోజుల పాటు ఐసియులో ఉంచినట్లు వైద్యులు చెప్పారు. లక్ష్మి రెండు కిడ్నీలను కాపాడగలిగినట్లు వారు తెలిపారు. తాము కూడా ముందు ఆందోళనకు గురయ్యామని, అయితే ఆపరేషనును విజయవంతంగా పూర్తి చేయగలిగామని వారంటున్నారు.












Click it and Unblock the Notifications
