సుధాకర్ రెడ్డి దుర్భాషలు: పెద్దల సభలో గలాభా
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ పి. సుధాకర్ రెడ్డి దుర్భాషలాడుతూ తెలుగుదేశం సభ్యులపైకి దూసుకెళ్లారు. వరికి మద్దతు ధరపై తెలుగుదేశం సభ్యులు బుధవారం శాసనమండలిలో ఆందోళనకు దిగారు. సభాధ్యక్షుని పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ సమయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఆగ్రహం అణచుకోలని కాంగ్రెస్ సభ్యుడు పి. సుధాకర్ రెడ్డి తెలుగుదేశం సభ్యులపైకి దూసుకెళ్లి దుర్భాషలాడారు. కొద్ది సేపు తోపులాట జరిగింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజును కూడా సుధాకర్ రెడ్డి తోసేశారు.
గలాభా జరుగుతున్న సమయంలో చైర్మన్ చక్రపాణి సభను సోమవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు. సుధాకర్ రెడ్డి తీరును నిరసిస్తూ తెలుగుదేశం సభ్యులు ధర్నాకు దిగారు. సుధాకర్ రెడ్డిపై చర్య తీసుకోవాలని వారు చెర్మన్ ను కోరారు. దీనిపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని చక్రపాణి హామీ ఇచ్చారు. సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. సుధాకర్ రెడ్డిని తీరును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమర్థించారు.












Click it and Unblock the Notifications
