బాబు నా అంతు చూస్తానన్నాడు: వైయస్


Rajasekhar Reddyహైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనను బెదిరించడం వల్లే తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. వేలు పెట్టి చూస్తూ నీ అంతు చూస్తానని అనడం వల్లనే తాను చంద్రబాబును నోర్ముయ్ అని అనాల్సి వచ్చిందని ఆయన బుధవారంనాడు అన్నారు. తనను బెదిరిస్తే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. తాను కూడా ఉప్పు కారం తింటున్నానని ఆయన అన్నారు. తమ కన్నా అభివృద్ధి చేసినవారెవరని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కుళ్లి చస్తున్నాడని, అందుకే నిరాశనిస్పృహలతో దిగజారి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు అన్న మాటలను కావాలంటే పరిశీలించుకోవచ్చునని ఆయన అన్నారు. పరిశీలనకు చంద్రబాబు వస్తే తాను కూడా వస్తానని ఆయన చెప్పారు. విషయాలు చర్చకు వస్తే బండారం బయటపడుతుందని తెలుగుదేశం పార్టీ వారు అల్లరికి దిగుతున్నారని ఆయన అన్నారు. శాసనసభ తీరు తనకు బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. గుర్రాన్ని నీళ్ల దగ్గరకు తీసికెళ్లగలం గానీ బలవంతంగా నీళ్లు తాగించలేం కదా అని ఆయన అన్నారు. అంబుడ్స్ మన్ అంటే వామపక్షాలకు అర్థం తెలుసునా అని ఆయన అడిగారు. మామూలు పరిస్థితిలో అయితే నోర్ముయ్ అని అనకూడదని, అయితే చంద్రబాబు బెదిరించడం వల్ల చూస్తూ ఊరుకోలేకపోయానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+