నందిగ్రామ్ వద్ద మేధా పాట్కర్ పై దాడి
కోల్ కత్తా: నందిగ్రామ్ సమీపంలో మేధాపాట్కర్ పై గురువారం దాడి జరిగింది. మేధా పాట్కర్ ప్రయాణిస్తున్న కారుపై ఆగంతకులు రాళ్లు రువ్వారు. అయితే ఆమె క్షేమంగానే ఉన్నారు. సిపియం కార్యకర్తలే తనపై దాడి చేశారని మేధాపాట్కర్ ఆరోపించారు. తనను జట్టు పట్టుకుని లాగడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.
తనపై చేయి చేసుకోవడానికి సిపియం కార్యకర్తలు ప్రయత్నించారని ఆమె అన్నారు. దాడికి నిరసనగా మేధా పాట్కర్ తన అనుచరులతో రోడ్డుపై బైఠాయించారు. నందిగ్రామ్ కు వెళ్తున్న ఆమెపై ఈ దాడి జరిగింది. నందిగ్రామ్ లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. వారికి మేధా పాట్కర్ మద్దతు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications
