పార్లమెంటులో తెలంగాణపై ప్రైవేట్ బిల్లు: దత్తాత్రేయ
హైదరాబాద్: వచ్చే పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ బిల్లును ప్రతిపాదించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ చెప్పారు. పార్లమెంటులో 193 నిబంధన కింద తెలంగాణపై ప్రసావనకు తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఈ నెల 14వ తేదీన ఒక ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్తుందని ఆయన చెప్పారు.
తెలంగాణపై ఇక నాటకాలు, దాగుడుమూతలు వద్దని ఆయన రాజకీయ పార్టీలకు సలహా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసేవారందరూ తమ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ప్రైవేట్ బిల్లు ప్రతిపాదించడం ద్వారా తెలంగాణపై రాజకీయ పార్టీల తీరును బయట పెడుతామని ఆయన అన్నారు. వ్యక్తిగత విమర్శలతో నాయకులు చట్టసభల గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ దీపావళి పర్వదినమైనా నాయకుల ప్రవర్తనలో మార్పు తేవాలని ఆయన ఆశించారు.












Click it and Unblock the Notifications
