వంగవీటి రాజీనామా లేఖ నాకివ్వలేదు: నెహ్రూ
విజయవాడ: శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ రాజీనామా విషయాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చూసుకుంటారని కాంగ్రెస్ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ అన్నారు. రాధాకృష్ణ రాజీనామా లేఖను తనకు ఇవ్వలేదని, ముఖ్యమంత్రికి ఇచ్చారని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నెహ్రూకు అక్రమంగా హైదరాబాదులో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను కట్టబెట్టారని వచ్చిన వార్తలపై వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేశారు. నెహ్రూకు వ్యతిరేకంగానే ఆయన ఈ రాజీనామా చేశారు.
తనతో ముఖ్యమంత్రి ఈ ఉదయం మాట్లాడారని, ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని, ముందు ఆ విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు. తాను భూములను అక్రమంగా పొందలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రైవేట్ భూములు గానీ, ప్రభుత్వ భూములు గానీ ఆక్రమించుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
