తిరుమలకు దీపావళి వచ్చింది
తిరుమల: తిరుమలలోని బాలాజీ కాలనీవాసులు చాలా కాలం తర్వాత ఈ ఏడాది దీపావళి పర్వదినాన్ని మతాబులు పేల్చి జరుపుకోనున్నారు. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అనుమతించడంతో బాలాజీ కాలనీవాసులకు మతాబులతో దీపావళి పర్వదినం జరుపుకునే అవకాశం లభించింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై నక్సలైట్లు దాడి చేసిన తర్వాత 2003 నుంచి తిరుమలలో మతాబులను కాల్చడాన్ని తిరుమల దేవస్థానం నిషేధించింది.
బాలాజీ కాలనీవాసుల విజ్ఞప్తితో షరతులతో మతాబులు కాల్చడానికి టిటిడి అధికారులు అనుమతించారు. తక్కువ శబ్దం చేసే మతాబులను మాత్రమే కాల్చాలని వారు నిబంధన పెట్టారు. ఇటీవల యూత్ కాంగ్రెస్ అలిపిరి నుంచి తిరుమల వరకు ర్యాలీ నిర్వహించి మతాబులు పేల్చింది. అది రాజకీయ వర్గాల్లో వివాదానికి దారి తీసింది. కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. దాంతో మతాబులు పేల్చినవారిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications
