వార్తలు రాసిన జర్నలిస్టుల అరెస్టుపై నిరసన
హైదరాబాద్: జర్నలిస్టుల అరెస్టుకు నిరసనగా హైదరాబాదులోని జర్నలిస్టులు గురువారం ఉదయం సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. జర్నిలిస్టుల అరెస్టు అప్రజాస్వామికమని జర్నలిస్టు నాయకులు అంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని వార్తలు రాసిన ఇద్దరు కర్నూలు జిల్లా జర్నలిస్టులపై కేసు పెట్టి వారిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు.
ముఖ్యమంత్రి వైయస్, నటుడు నాగార్జున, మంత్రి మారెప్ప, శాసనసభ్యుడు శిఖామణిల పేరిట ఇళ్లు మంజూరైనట్లు లద్దగిరి గ్రామ కార్యదర్శి ధృవీకరించిన విషయాన్ని వారు వార్తగా రాశారు. ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీరాములు, ఆంధ్రభూమి ప్రతినిధి ఉరుకందులలను పోలీసులు అరెస్టు చేశారు. మోసం, ఫోర్జరీ, అధికారుల ప్రతిష్ఠ దెబ్బ తీయడానికి ఫోర్జరీకి పాల్పడటం, బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణల కింద వారిపై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. జర్నలిస్టుల అరెస్టుకు నిరసనగా కడపలో జర్నలిస్టులు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications
