రాజీనామా చేసిన రాధాకృష్ణ వైయస్ తో భేటీ
హైదరాబాద్: శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ గురువారం ఉదయం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. తన రాజీనామాకు కారణాలను వంగవీటి రాధాకృష్ణ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో మాట్లాడినట్లు సమాచారం.
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాధాకృష్ణ బుధవారం సాయంత్రం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. తన తండ్రి హత్యకు కారణమైనవారికి నజరానాలు ఇచ్చారనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా చేశారు.
నిరుపేదలకు వంద గజాల స్థలం కోసం తన తండ్రి పోరాడుతూ హత్యకు గురి కాగా, కంకిపాడు శాసనసభ్యుడు దేవినేని నెహ్రూకు 120 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రత్యేక జీవోల ద్వారా కట్టబెట్టడం తనకు బాధ కలిగించిందని వంగవీటి రాధాకృష్ణ తన రాజీనామా లేఖలో అన్నారు. రాధాకృష్ణకు మద్దతుగా విజయవాడ కార్పోరేటర్లు చాలా మంది రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధాకృష్ణ రాజీనామా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications
