వరి ధరపై దేశవ్యాప్త ఉద్యమం: చంద్రబాబు
హైదరాబాద్: వరికి మద్దతు ధర కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ నెల 24వ తేదీ విజయవాడలో జరిగే రైతు గర్జన సదస్సుతో దానికి శ్రీకారం చుడుతామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ సదస్సుకు తృతీయ ప్రత్యామ్నాయ కూటమి నాయకులు హాజరవుతారని ఆయన చెప్పారు.
ఆ తర్వాత దేశంలోని ఇతర ఫ్రాంతాల్లో సదస్సులు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. వరికి వేయి రూపాయల మద్దతు ధర, ఇతర పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
